Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
సాయిగణేష్ డాట్ ఆన్లైన్: తమిళ  అసురన్‌.. స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన ఈ చిత్రం తమిళంలో ఘన విజయంతో పాటు జాతీయ అవార్డు సాధించింది. ఈ సూపర్‌ హిట్‌ సినిమాకు రీమేక్‌గా వస్తోంది “నారప్ప”. విక్టరీ వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సీతమ్మ వాకిట్లో ప్రేమ్..శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించగా  గత మే 14న థియేటర్లలో రిలీజ్‌ చేద్దామనుకున్న ఈ చిత్రం కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇంకా థియేటర్స్ తెరవలేదు. ఇంతలోనే నారప్పకు ఓటీటీ భారీ  మొత్తంలో ఆఫర్ రావడంతో (40 కోట్లు?)భారీ మొత్తంలో డీల్‌ కుదుర్చుకోవడంతో, అగ్రహీరో సినిమా  ‘నారప్ప’ రిలీజ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో దక్కించుకుంది. ఈ సందర్భంగా నారప్పను జూలై 20 నుంచి ప్రసారం చేస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. మీ ప్రియమైనవారితో కలిసి ఇంట్లోనే సురక్షితంగా సినిమాను చూసి ఆస్వాదించండంటూ హీరో వెంకటేశ్‌ సైతం ట్వీట్‌ చేశాడు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *