Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

సాయిగణేష్ డాట్ ఆన్లైన్: బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకు ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల్లోనూ సీజన్ 4 గ్రాండ్ సక్సెస్ కావడంతో.. అవే తరహా వాతావరణం ఉన్నప్పటికీ.. బిగ్ బాస్ 5 ను విజయవంతం చేయడానికి నిర్వాహకులు కసరత్తు పూర్తి చేస్తున్నారు. అయితే జూలై రెండో వారంలో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ప్రారంభం కానునట్లు తెలుస్తోంది. ఈ సారి మరింత కొత్తగా షోని నడిపించాలని షో నిర్వాహకులు భావిస్తున్నారట. పాపులర్‌ అయిన నటీనటులను మాత్రమే షోలోకి తీసుకోబోతున్నారట. ఇక ఐదో సీజన్‌ త్వరలోనే ప్రారంభం కానుండటంతో కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ సీజన్‌లో యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, యాంకర్ వర్షిణి, కమెడియన్‌ ప్రవీణ్‌, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, సింగర్‌ మంగ్లీ, న్యూస్ యాంకర్ ప్రత్యూష పాల్గొనబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ సీజన్‌ హోస్టుగా రానా వ్యవరిస్తాడని తెలుస్తోంది.

By admin