Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

సాయిగణేష్ డాట్ ఆన్లైన్: రెబల్ స్టార్ ప్ర‌భాస్ వ‌రుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టిస్తోన్న చిత్రాల్లో ‘స‌లార్’ ఒక‌టి. K.G.F ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కుడు. ఎంతో క్రేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్ కోసం ప్ర‌భాస్ ఓ డిఫ‌రెంట్ రోల్‌లో పాత్రలో కనిపిస్తున్నారు. ప్ర‌భాస్ న‌టిస్తున్న పాత్రేంటో తెలుసా? దీనిలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ డ్యూయెల్ రోల్‌లో న‌టిస్తున్నార‌ని, అందులో ఓ రోల్ ఆర్మీ ఆఫీస‌ర్ రోల్ అని వార్త‌లు వినిపిస్తున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఇందులో ప్రభాస్ కు బాస్ స్థాయి కీలక రోల్ లో మెగాస్టార్ చిరంజీవి ని నటింపచేయాలని ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయట మరి…లేక పొతే ఆ పాత్రలో మోహన్ లాల్ నటిస్తారు. ఇక విలన్లుగా హిందీ హీరో జాన్ అబ్రహం, విజయసేతుపతి నటిస్తున్నారని సమాచారం. శృతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ ‘సలార్’ను వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ప్రకటించడం గమనార్హం.

PLEASE SUBSCRIBE TO MY CHANNEL

By admin