Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

సాయిగణేష్ డాట్ ఆన్లైన్: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, జగపతి బాబు ప్రధాన పాత్రలో క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న‘పుష్ప’. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా నిలిచిపోయింది. మరోవైపు హీరో అల్లు అర్జున్‌ కరోనా బారిన పడడంతో ఆయన ప్రస్తుతం ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నాడు.తాజగా నెగిటివ్ వచ్చింది ఇదిలా ఉంటే.. ‘పుష్ప’ సినిమా 2 భాగాలుగా వస్తుందని తాజాగా ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ వైరల్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నిర్మాతల్లో ఒకరు దీనిపై రియాక్ట్ అవుతూ పుష్ప సినిమా రెండు భాగాలుగా వస్తుందనే వార్త నిజమే అని అన్నారని తెలుస్తుండటం మరింత ఆసక్తికర అంశంగా మారింది. వేల కోట్ల విలువైన ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ ఫై ఎంతో స్పాన్‌ ఉన్న ఈ కథను రెండున్నర గంటల్లో చెప్పడం కష్టం. అందుకే హీరో అల్లు అర్జున్‌, సుకుమార్‌గారితో చర్చించి రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విలన్‌గా మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. రష్మికా మందన్న హీరోయిన్‌, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *