Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

స్టార్ మాటివి లో ప్రసారమయిన బిగ్ బాస్ హోస్టుగా అదుర్స్ అనిపించిన సినీహీరో ఎన్టీఆర్,మరోసారి జెమిని టీవీలో ఓ షో చేయబోతున్నాడని తాజా వార్త వైరల్ అయ్యింది. గతంలో నాగార్జున, చిరంజీవి మా టీవీలో నిర్వహించిన మీలో ఎవరు కోటీశ్వరుడు తరహా షో నే ఎన్టీఆర్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ చాలా ట్విస్ట్ లు వున్నాయి.వాస్తవానికి ఈ షో స్టార్ మా చానెల్ ది. అయితే ఈసారి జెమిని ఛానెల్ కు ఆ షో చేస్తుందని . అయితే ఆ టైటిల్ ను వాడుకోవడం లేదు. వేరే టైటిల్ ను సెట్ చేస్తున్నారట?ఈ షో కోసం వారానికి ఒకటి రెండు రోజులు కేటాయిస్తే సరిపోతుందని తెలుస్తోంది. ఈ షో కి ఎన్టీఆర్ డ్రెస్సింగ్ స్టయిల్, గెటప్ అన్నీ డిఫరెంట్ గా వుండేలా ప్లానింగ్ ప్రారంభమైంది. ఈ షో కోసం అన్నపూర్ణ స్టూడియోలో రెండు ఫ్లోర్ లు బుక్ చేసారు. దాంతో ఈ న్యూస్ కాస్తా బయటకు వచ్చేసింది.ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చేస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా చేయాల్సి వుంది.

By admin