bigg boss nagarjuna
Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 4 కాస్తో కూస్తో నిలబడిందంటే నిస్సందేహంగా వారంలో శని, ఆదివారాలలో కనపడే కింగ్ నాగార్జున చేసే ముచ్చటైన హోస్టింగ్ అని వేరే చెప్పనక్కరలేదు. మరి కనీసం 3వారలు అక్కినేని నాగార్జున హోస్టింగ్ ను ప్రేక్షకులు మిస్ అవుతారని అనధికారికంగా తాజా సమాచారం వచ్చింది.

అక్కినేని నాగార్జున హీరోగా దర్శకుడు సోలోమన్ దర్శకత్వంలో వైల్డ్ డాగ్ అనే ఓ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా షూటింగ్‌.. కరోనా వల్ల వాయిదా పడింది. త్వ‌ర‌లో థాయ్ లాండ్‌లో కీల‌క‌మైన షెడ్యూల్ జ‌ర‌గ‌బోతోంది. క‌నీసం 20 రోజుల పాటు.. షూటింగ్ సాగ‌నుంద‌ట‌. ఈ 20 రోజులూ బిగ్ బాస్ కి నాగ్‌ దూరం కాబోతున్నాడట మరి. ఆయా ఎపిసోడ్ల‌ని ఎవ‌రితో భ‌ర్తీ చేయాలి? అనే విష‌యంలో బిగ్ బాస్ నిర్వాహ‌కులు ఇంకా నిర్ణయానికి రాలేదట మరి..?

By admin